చైనాకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ షాకిచ్చారు. పాట్నాలో నిర్మించనున్న మహాత్మాగాంధీ వంతెనకు గతంలో ఇచ్చిన టెండర్‌ను రద్దు చేశారు. వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చైనాకు చెందిన రెండు కంపెనీలతో భాగస్వామ్యం ఉండటం వల్లే టెండర్ రద్దు చేశారు.
భాగస్వాములను మార్చుకోమని చెప్పినా కాంట్రాక్టర్లు నిరాకరించడంతో చివరకు టెండర్‌నే రద్దు చేసినట్లు బీహార్ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు.
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి భారత జవాన్లపై రాళ్లు, మేకులు కొట్టిన లాఠీలతో దాడి చేసింది. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు 20 మంది భారత జవాన్లు చనిపోయారు.
ఘర్షణలో 45మందికి పైగా చైనా సైనికులు చనిపోయారు. అయితే చైనా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కానీ రెండు వైపులా నష్టం జరిగిందని మాత్రమే డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.
జూన్ 15న చనిపోయిన జవాన్లలో ఐదుగురు బీహారీలే. దీంతో చైనాపై బీహారీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ క్రమంలోనే గాంధీ వంతెన టెండర్ రద్దు చేశారు. త్వరలో చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను బీహార్ ప్రభుత్వం రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.
More Stories
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల బాండ్ల పథకంపై తీర్పు సమీక్షకు `సుప్రీం’ నిరాకరణ