
వచ్చే ఏడాది నాటికి కరోనాకు టీకా కూడా వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కూడా ఇతర వ్యాధుల మాదిరిదేనని, కానీ మన జీవనశైలిని మార్చుకోవాల్సి వస్తుందని ఆయన సూచించారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400కు పైగా జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంతో పోలిస్తే భారతదేశం కరోనతో మెరుగ్గా పోరాడుతోందని హర్షవర్ధన్ భరోసా వ్యక్తం చేశారు.
కరోనా పరీక్షలను పెంచామని అదే విధంగా భారత్‌లో మరణాల రేటు కుడా తక్కువగానే ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కరోనా మొదటి కేసు జనవరి 30న వచ్చిందని, దేశ జనాభా 130 కోట్లు కాగా, ప్రస్తుతం 5 లక్షల కేసులున్నాయని అందులో 3.10లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలో కేవలం 3 శాతం మాత్రమే మరణ రేటు ఉందని, ఇది అత్యంత తక్కువని చెప్పారు. మనకంటే బ్రెజిల్, యూకే, యూఎస్‌లో మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. 5 నెలల క్రితం ఒక్క ప్రయోగశాల ఉంటే ఉప్పుడు 1036 ప్రయోగశాలల్లో లక్షల్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు.
మనం మెరుగైన స్థితిలో ఉన్నామని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచమంతా కృషి చేస్తోందని, భారతదేశంలో కూడా దీనిపై పరిశోధన జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాందేవ్ బాబా విడుదల చేసిన కరైనల్ ఔషధంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందన్నదని చెబుతూ త్వరలో ఈ ఔషధంపై ఖచ్చితమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.
More Stories
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు
హామీల ఎగవేతల బడ్జెట్
నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?