రాహుల్ కు చైనా, పాక్ ప్రోత్సహం 

చైనా, పాకిస్తాన్‌లు రాహుల్ హ్యాష్‌ట్యాగ్‌ను ముందు తీసుకెళ్తున్నాయని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ సహితం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదని హితవు చెప్పారు.

“ఇది నా కోసం కాదు. తమ నాయకుడిని  పాక్, చైనాలు ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ గ్రహించాలి. ఈ విపత్కర సమయంలో చైనా, పాకిస్థాన్ ఏం ఇష్టపడతాయో మీరు అవే చెబుతున్నారు” అంటూ ఆ పార్టీ నేతలను వారించారు.

భారత్  వ్యతిరేక ప్రచారాన్ని మేం సమర్థంగా తిప్పికొట్టగలం. అయితే అతి పెద్ద రాజకీయ  పార్టీకి మాజీ అద్యక్షుడివై ఉండి ఇలాంటి నిస్సార రాజకీయాలు చేసినప్పుడు బాధాకరంగా ఉంటుంది” అంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు.

అద్వానీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షులుగా  ఉన్నారు. ఇప్పుడు నడ్డా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారెవరైనా ఉన్నారా? అని అమిత్ షా ప్రశ్నించారు. 

ఇందిర తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాక కాంగ్రెస్ అధ్యక్షుడిగా వహరించిన బయటి వ్యక్తి పేరు చెప్పండి? ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటూ షా దుయ్యబట్టారు.