దేశంలో చైనా భక్తులను వెలివేయాలి 

దేశంలో చైనా భక్తులను వెలివేయాలి 

చైనాలో వర్షం పడితే భారత్‌లో గొడుగులు పట్టే చైనా భక్తులను భారత దేశం నుంచి వెలివయాలని విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణశాఖ డిమాండ్‌ చేసింది. ఈ దేశ సంపదను అనుభవిస్తూ మన శతృదేశమైన చైనాకు మద్దతుగా మాట్లాడుతున్న కమ్యూనిస్టులను దేశ ద్రోహులుగా గుర్తిస్తూ అరెస్ట్‌ చేయాలని విహెచ్‌పి తెలంగాణశాఖ కార్యదర్శి బండారి రమేష్‌, ప్రచార సహ ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి డిమాండ్‌చేశారు. 

 శతృదేశం మేలు కోరుతూ స్వదేశం నాశనం కోరుతున్న కమ్యూనిస్టులను దేవ ప్రజలు ఛీత్కరిస్తున్నా వారికి బుద్దిరావడం లేదని మండిపడ్డారు.  భారత్‌లో చైనా ఉత్పత్తులను నిషేధించాలని దేశ పౌరులు డిమాండ్‌చేస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారనిఎద్దేవా చేశారు. 

వ్యాపారం పేరుతో చైనా వస్తువులను విక్రయిస్తూ ఈ దేశ సంపదను కొల్లగొట్టుకుని వెళ్తున్న చైనా మన దేశపునుంచి ఆదాయం పొందుతూనే మళ్లీ మన దేశ సైనికులపై దాడులకు దిగుతున్నారన్న విషయం కమ్యూనిస్టులు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. 

యావత్‌ దేశ ప్రజలు చైనా ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్‌చేస్తుంటే స్వదేశంలోనే భారతీయ వస్తువులను నిషేధించాలని సీపీఐ జాతీయనేత నారాయణ డిమాండ్‌ చేయడం సిగ్గుమాలిన చర్యగా వారు పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలను నాశనం   చేసి ఆర్దికంగా తామే పెద్దన్నగా అవతరించాలన్న దుర్భుద్ధితో చైనా కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నదని ఆరోపించారు. 

ఇప్పటికే భారత చట్టసభల్లో ఉనికి కోల్పోయిన క మ్యూనిస్టులు ఎర్ర జెండాలతో రోడ్లపైకి వచ్చి జాతి ద్రోహ కార్యకలాపాఆలకు పాల్పడడం చట్టరీత్యా నేరుగా భావించి దేశ ద్రోహుల చట్టం కింద అరెస్ట్‌చేయాలని వారు డిమాండ్‌ చేశారు.