జిన్‌పింగ్‌కు భారత్ దౌత్య అల్టిమేటం

సుదీర్ఘ ఎల్‌ఎసి వెంబడి చైనా యుద్ధ స్థితిని కల్పిస్తోందని, ద్వైపాక్షిక సంబంధాలను దిగజారుస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య లద్ధాఖ్ ప్రాంతంలో ఘర్షణాయుత పరిస్థితి నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అత్యున్నత అసాధారణ స్థాయిలో చైనాకు శుక్రవారం దౌత్యపరమైన హెచ్చరిక వెలువరించింది. 

చైనా అధ్యక్షుడు, చైనా సైనిక బలగాలు పిఎల్‌ఎకు సారథి అయిన జిన్‌పింగ్ పేరును ప్రస్తావించకుండానే ఈ డిప్లోమాటిక్ అల్టిమేటం (డిఎ) వెలువరించారు. ఇటీవలి కాలంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి 348 యుద్ధ మేఘాలను సృష్టిస్తున్నాయి. ఇది దాదాపుగా యుద్ధ స్థితిని కల్పించిందని ఈ దౌత్య హెచ్చరికలో తెలిపారు. 

దౌత్య దయనీయ స్థితి కాలానికి చైనా వైఖరితో ఇప్పుడు కాలపు గడియారం వెనకకు తిరుగుతోందని, 1990 నాటి పరిస్థితిని తీసుకువస్తోందని, దీనిని దురుద్ధేశపూరితం అనుకోవాలా? కవ్వింపు చర్యలుగా భావించాలా? తెలియడం లేదని ఈ ఘాటు సందేశంలో తెలిపారు. ఈ హెచ్చరికలో ఎక్కడా జిన్‌పింగ్ పేరును ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయనకు పరోక్షంగా స్పష్టం చేశారు. 

ఎంతోదూరం విస్తరించుకుని ఉన్న సరిహద్దు ప్రాంతం వెంబడి తూర్పు  లద్ధాఖ్‌లో చైనా సైన్యం దుందుడుకు ధోరణిని ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. ఎల్‌ఎసి వెంబడి ఉద్రిక్తతల సడలింపులకు, నివారణకు కుదిరిన 1993 నాటి ఒప్పందంలోని అంశాలన్నింటిన్నీ కాలరాస్తున్నారని భారత ప్రభుత్వం చైనా పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అప్పటి ఒప్పందం పివి నరసింహరావు జియాంగ్ జెమిన్‌ల హయాంలో ఇరుదేశాల మధ్య కుదిరింది. దీని మేరకు ఎల్‌ఎసి వెంబడి సైనిక బలగాలు నామమాత్రంగా ఉండాలని నిర్ధేశించారు. ఇటీవలి కాలంలో కుదిరిన సైనిక చర్చల అవగావహన ప్రక్రియకు కూడా చైనా తూట్లు పొడుస్తోందని అల్టిమేటంలో పేర్కొన్నారు. 

గత మూడు దశాబ్దాలుగా నెలకొన్న దౌత్య సక్రమ పద్ధతుల ఫలాలు ప్రస్తుత పరిణామాలతో దెబ్బతింటున్నాయని, దీనితో పరిస్థితి తిరిగి మునుపటి స్థాయికి దిగజారుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం పిఎల్‌ఎ వెనకకు వెళ్లాలి, ప్రతిష్టంభనల నివారణకు చర్యలు తీసుకోవాలి, అప్పుడే పరిస్థితి చక్కబడుతుంది అని స్పష్టం చేశారు.

శాంతియుత పరిస్థితికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందని స్పష్టం చేస్తూ అయితే ఎదుటి పక్షం సైనికపరంగా చర్యకు దిగితే దానిని తగు విధంగా అదే రీతిలో బలగాల స్థాయిలో ఎదుర్కొవడం జరుగుతుందని హెచ్చరించింది. ఈ శక్తిసామర్థం భారత్‌కు ఉండనే ఉందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

దెబ్బకు దెబ్బ తీయడం జరుగుతుందని హెచ్చరించింది. ఎల్‌ఎసి వెంబడి ప్రతిష్టంభన నివారణకు పిఎల్‌ఎ చర్యలు తీసుకోకపోతే యావత్తూ ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని చెబుతూ టాస్ ఆ పక్షం వైపే ఉందని ఇండియా స్పష్టం చేసింది.