లఢఖ్‌లోని గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణ ప్రయత్నించడం పట్ల దేశంలోనే కాకుండా విదేశాల్లోని చైనీయుల నుంచి కూడా చైనా ప్రభుత్వానికి అసమ్మతి ఎదురవుతుంది.
చైనాలో అక్కడి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు, చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ సంభాషణల్లో మాత్రం గల్వాన్‌లో చైనా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెక్‌ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైందని ఒక నేషనల్ టీవీ ఛానెల్ తెలిపింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఆ సంస్థ చెబుతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా గల్వాన్‌లో ఆ దేశం వ్యవహరించిన తీరు సరికాదని విమర్శిస్తున్నారు.
సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సంస్థ సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
అదృశ్య శక్తి ఒకటి వాటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు భావిస్తున్నారు. వారే కాకుండా హాంకాంగ్, తైవాన్‌లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు వినిపిస్తున్నాయి.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం