రాచరిక పాలనకు తెరలేపిన కేసీఆర్  

తెలంగాణలో రాచరిక పాలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెర లేపారని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ విమరసంచారు. ఆయన ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే వాటిని టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో చూస్తుందని విమర్శించారు. 
 
కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైద్యులు, పోలీసులు, జర్నలిస్ట్ లు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.  హైదరాబాద్ లో కరోనాతో జనాలు పిట్టల్లా రాలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో నే టెస్టింగ్, ట్రేసింగ్ , ట్రీట్మెంట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. 
 
అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తున్నానని లక్ష్మణ్ వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం సలహాలు, సూచనలు చేస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్ ను ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వ నిర్వహణను మాత్రం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. 
 
 శవాల ఆచూకి గల్లంతై గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయని దయ్యబట్టారు. కరోనా ను కేంద్రం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీలో చేర్చడం లేదని మండిపడ్డాయిరు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయకుండా పేద ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ దగా చేస్తోందని విమర్శించారు.