తెలంగాణలో విద్యా, వైద్య రంగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే తగు వివరణ ఇవ్వాలని బిజెపి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే, ఇందులో ఎవరు బాధ్యులు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే, ఇందులో ఎవరు బాధ్యులు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఇది అబద్ధ ప్రచారం అయితే ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఈ విషయంపై తక్షణం స్పందించి స్పష్టత ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని, డాక్టర్ కూర్చుని పేషెంట్లను పరిశీలించడానికి సరైన గది కూడా లేకుండా కారిడార్‌లలోనే చికిత్స జరుగుతున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. స్ట్రెచర్ మీదనే ప్రిస్క్రిప్షన్లు రాయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మందులు లేవు, గ్లౌజులు లేవు, సర్జికల్ మెటీరియల్ కొరత ఉంది, ఎక్విప్మెంట్స్ ఉన్నా వాటిని నిర్వహించే టెక్నీషియన్స్ లేరని విమర్శించారు. ఆసుపత్రులకు అవసరమైన నిధులు హెచ్‌డిఎస్, ఆరోగ్యశ్రీ, ఇతర వనరుల ద్వారా రావాల్సి ఉన్నప్పటికీ, ఆ నిధులు సమయానికి అందడం లేదని వెంకటరమణారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ఇప్పుడు వచ్చిన ఆరోపణ ప్రకారం, ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న మందులను భారీగా కొనుగోలు చేసి వాటిని ఉపయోగించకుండా వదిలేసి, తర్వాత వాటిని బయోమెడికల్ వేస్ట్‌గా డిస్పోజ్ చేయడానికి మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెడికల్ వేస్ట్ అనేది సాధారణ చెత్త కాదని, ఇందులో సిరంజీలు, కెమికల్స్, ఇంజెక్షన్లు, మెడిసిన్స్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయని తెలిపారు.
వీటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, గాలి, నీటి కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ టెండర్ ఎప్పుడు ఇచ్చారు? టెక్నికల్ బిడ్ వివరాలు ఏమిటి, ఫైనాన్షియల్ బిడ్ ఏమిటి, ఏ కంపెనీలు పాల్గొన్నాయి, చివరికి ఏ కంపెనీకి టెండర్ ఇచ్చారు, వారు సరఫరా చేసిన మందుల మాన్యుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఏమిటి అన్న వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని బిజెపి ఎమ్యెల్యే డిమాండ్ చేశారు.

More Stories
బతుకమ్మకుంట కేసులో `సుప్రీం’లో హైడ్రాకు చుక్కెదురు
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం
రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణకు భూమి కేటాయించండి