యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సదర్భంగా ప్రధాని మోదీ ఆన్‌లైన్‌దారా జాతినుద్దేశించి ప్రసంగీస్తూ ప్రపంచం యావత్తు యోగాను గుర్తించిందని చెప్పారు.
రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు యోగాలో ఆసనాలున్నాయని, ఇందులో ప్రాణాయామం అనే వ్యాయామం దోహదపడుతుందని తెలిపారు. ప్రాణాయామాన్ని రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్య, ఉల్లాసం పెంపొందుతాయని ప్రధాని పేర్కొన్నారు.
శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని, అందువల్ల ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని హరిద్వార్‌లో జరిగిన కార్యక్రమంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా పాల్గొన్నారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం మొట్టమొదటిసారి సామూహిక కార్యక్రమంగా కాక డిజిటల్ మీడియా వేదికగా జరుపుతున్నారు. 2015 జూన్ 21వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.
ఇంటి వద్ద యోగ, కుటుంబంతో యోగ అనే అంశంతో ఈ ఏడాది యోగ దినోత్సవం ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైనది. విదేశాలలో ఉన్న భారతీయ రాయబారి కార్యాలయాలు డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం