ఖగోళ అద్భుతం రాహుగ్రస్త్య సూర్యగ్రహణం  

దేశవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. పూర్తిస్థాయిలో సూర్యుడు వలయాకారంలోకి మారాడు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డు పడింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లైంది. మ‌న దేశంలో మాత్రం ఉద‌యం 10.14 గంట‌ల‌కు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం3:04 గంటలకు సూర్యగ్రహణం వీడనుంది.

మధ్యాహ్నం 12:10 గంటలకు గరిష్ఠ స్థితిలో సూర్యగ్రహణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలపారు. తెలుగురాష్ట్రాల్లో ఉదయం 10:14 నుంచి హధ్యాహ్నం 1:44 గంటలకు వరకు సూర్యగ్రహణం కొనసాగింది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు మూసివేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఆలయాల్లో సంప్రోక్షణ, ప్రత్యక పూజలు నిర్వహించనున్నారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి.

ఆకాశంలో అరుదైన సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడనుంది. మళ్లీ 2022 సంవత్సరంలో సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నాసారు. సూర్యగ్రహణం సందర్భంగా నిన్న రాత్రి 8:30 గంటలకు బాసర సరస్వతీ ఆలయం మూసివేసిన ఆలయఅధికారులు. యంత్రం 4:30 గంటల నుంచి బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

సూర్యగ్రహణం కారణంగా భూమిమీద పడే అతినీలలోహిత కిరణాలతో కరోనా వైరస్ కొంత మేరకు నశించే అవకాశముందని శాస్త్రవేత్తులు అంటున్నారు. ముందుగా సూర్యగ్రహణం గుజరాత్ తో కనిపించింది. మనదేశంలో అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. జోషీమఠ్ డెహ్రాడూన్ లతో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.