మైనింగ్ అక్రమాలు బైటపెట్టినందుకే బురద 

మైనింగ్ అక్రమాలను బయటపెట్టినందుకు, తన గురించి కావాలని తప్పుడు వివరాలు సమర్పించి, తనది నకిలీ డిగ్రీ అని తనపై బురదజల్లుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తనకు డిగ్రీ ఇచ్చిన   యూనివర్సిటీలో  అసలు తాను చదవలేదంటూ మై హోమ్ గ్రూప్ కి చెందిన ఒక టీవీ ఛానెల్ పదే పదే రకరకాల కథనాలు ప్రసారం చేసిందన్నారని ఆరోపించారు.
వారి ఆరోపణలు తనను నన్ను బాధించినా, నిజం నిలకడ మీద తెలుస్తదన్న నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు. ఈ రోజు, అదే యూనివర్సిటీలో తాను పీజీ పూర్తి చేసానని, జనార్ధన్ రాయి నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ డైరెక్టర్ అఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్వయంగా ఇచ్చిన లేఖను మీడియా ముందు పెట్టారు.
ఇంతకాలం ఈ విషయమై ఆ మీడియా సంస్థ నిరవధికంగా చేసిన మీడియా-విచారణల్లో వాది, ప్రతి వాది, సాక్ష్యం, జడ్జి, తీర్పు, సమస్తం ఆ ఛానెల్ వారే అయ్యారని ఎద్దేవా చేశారు.  మైనింగ్ అక్రమాల టాపిక్ ని పక్కదోవ పట్టించడానికి తీవ్ర కృషి చేశారని దయ్యబట్టారు. ఆ ఛానల్ వారు బేషరతుగా క్షమాపణ చెబితే, ఆ యాజమాన్యానికే మంచిదని అరవింద్ హితవు చెప్పారు.
 
ఒక నిఖార్సైన భారత మాత బిడ్డ అయిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ కోసం రాజకీయాల్లోకి  వచ్చానని చెబుతూ విలువలు, నిజాయితీలే తమ ఆస్తులని,  వాటిని పెంపొందించడానికి వచ్చానని మ‌న్నారు. ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అన్న విషయంలో పూర్తి పారదర్శకతతో ఉంటామ‌ని తెలిపారు. ఇది తెలుసుకోకుండా కేసీఆర్ తో కలిసి దేశాన్ని దోచుకున్న దొంగ సొమ్ముస్పష్టం చేశారు.