
కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ సేవలను ఆయన కొనియాడారు. ప్రధాని మోడీ ఆదేశాలతో కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించానని ఆయన చెప్పారు.
కల్నల్ సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికి కాకుండా దేశానికి , సైన్యానికి తీరని నష్టమని విచారం వ్యక్తం చేశారు.
కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందని చెబుతూ చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
More Stories
మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!
మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ ఛైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారి