
భారత్, చైనా వ్యవహారంలో దేశమంతా ఏకమై ఒకవైపు ఉంటే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం మరోవైపు ఉన్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు అమిత్ షా శనివారం ఓ ట్వీట్ చేశారు.
గల్వాన్ అంశం విషయంలో కేంద్రంపై గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ విమర్శలపై ఓ సైనికుడి తండ్రి మాట్లాడుతూ, గల్వాన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఓ వీడియో విడుదల చేశారు.
ఈ వీడియోను అమిత్ షా తన ట్విట్టర్ లో పోస్టుచేస్తూ ఓ సైనికుడి తండ్రి రాహుల్ గాంధీకి స్పష్టమైన సమాధానం ఇచ్చారని, ఇప్పటికైనా రాహుల్ గాంధీ విమర్శలు మానుకొని జాతీ ప్రయోజనాల కోసం పాటుపడాలని అమిత్ షా హితవు పలికారు.
More Stories
హిందువులకు ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక
రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ
నటి ఖుష్బూ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్