ఏపీలో 100 దాటిన కరోనా మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. 8,000 దాటగా, మృతుల సంఖ్య 100 దాటింది. మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య గ‌డిచిన 24 గంట‌ల్లో 491 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ఐదుగురు క‌రోనా రోగులు  ప్రాణాలు కోల్పోయారు. 

దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 8,452కు చేరింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో మొత్తం 491 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, అందులో 390 లోక‌ల్స్ కాగా, ఇత‌ర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో 101 మంది ఉన్నార‌ని పేర్కొంది. 

అలాగే ఒక్క రోజులో క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒక‌రు మ‌ర‌ణించారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 101కి పెరిగిందని చెప్పింది.  ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని 4111 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని, ప్ర‌స్తుతం 4,240 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.