
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.
వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి.
గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే కావడం గమనార్హం.
అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టారు.
More Stories
2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్
అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం
స్టార్టప్ల ర్యాంకింగ్స్లో15వ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్