గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చైనా వస్తువులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇకపై చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల విషయంలో బిఐఎస్ క్వాలిటీ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తామని ఆయన ప్రకటించారు.
రోజువారీ కార్యాలయ పనుల్లో చైనా వస్తువులను వాడకూడదని కార్యాలయాల్లో పనిచేసే వారికి ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చైనా ప్రవర్తన కారణంగానే ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని అందరికీ పిలుపునిస్తున్నానని రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.
ఇతర దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేసే క్రమంలో వారందరూ తనిఖీలు చేస్తారని, బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేస్తే తిరస్కరిస్తారని మండిపడ్డాయిరు. అయితే వారి వస్తువులు మన దేశానికి వస్తే మాత్రం కఠిన నిబంధనలు ఉండవని చెబుతూ ఇకపై నిబంధనలు కఠినతరం చేస్తామని పాశ్వాన్ ప్రకటించారు.
రెస్టారెంట్లు, హోటళ్లలో చైనా ఆహారాలను బహిష్కరించాలని మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనా ద్రోహం చేసే దేశం. చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలి. చైనా ఆహారం.. భారతదేశంలో చైనీస్ ఆహారాన్ని విక్రయించే అన్ని రెస్టారెంట్లతో పాటు హోటళ్లను మూసివేయాలని ట్వీట్ చేశారు.
More Stories
పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి