కొండపోచమ్మతో నీళ్లు కాదు.. కరోనా సోకింది   

‘‘ఇటీవల కొండపోచమ్మ ప్రాజెక్టుకు 5 వేల మందిని సీఎం కేసీఆర్​ తీసుకపోయిండు. అక్కడ కరోనా నిబంధనలు ​ పాటించలేదు. ఆ ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలే కానీ.. కరోనా మాత్రం వచ్చింది” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 

అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేలకు, అధికారులకు, పీఏలకు, జర్నలిస్టులకు, గన్​మన్లకు కూడా వైరస్ సోకినదని గుర్తు చేశారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా రావడంతో సీఎంకు సెగ తగిలి ఇప్పుడు టెస్టులు చేస్తామంటున్నారని  ఎద్దేవా చేశారు. 

‘‘రాష్ట్రంలో కరోనా పరిస్థితిని చూసి కేంద్రం కోక్యామ్ చేసుకోవడం అయితదని, హెచ్చరించే ప్రమాదం ఉందని, హైదరాబాద్​ను ఆధీనంలోకి తీసుకుంటుందని భయపడి కేసీఆర్​ స్పందించిండు”అని పేర్కొన్నారు. 

కరోనాపై మొదటి నుంచి కేసీఆర్​ జోకులు వేయబట్టే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందని, ఇన్ని కేసులు వస్తున్నాయని సంజయ్ దయ్యబట్టారు.  ‘‘కరోనా అంశాన్ని రాజకీయ కోణంతో చూడొద్దని, పూర్తి సహకారం అందిస్తామని సీఎంకు చెప్పినం. లేఖ కూడా రాసినం. అఖిలపక్ష సమావేశం ​ పెట్టమన్నం” అని గుర్తు చేశారు. 

వినకుండా ఒంటెత్తుపోకడతో ఏం చేసిన తానే చేయాలని సీఎం అనుకుంటున్నడని ధ్వజమెత్తారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కరోనా ఎక్కడిది? పారాసిటమాల్ వేస్తే చాలు, అసెంబ్లీలో మాస్కులు , గ్లౌజులు పెట్టుకున్నమా? అని సీఎం ప్రశ్నించారని గుర్తు చేశారు. కరోనా లేని తెలంగాణ చేస్తా “కరోనా నీ చుట్టే తిరుగుతోంది. నీ ఎమ్మెల్యేలకు వచ్చింది”అని విమర్శించారు.