35 మంది చైనా సైనికులు మృతి ?

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో సోమ‌వారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది సైనికులు చనిపోయిన్నట్లు భారత్ సైనికాధికారులు ప్రకటించగా, ఇప్పటి  ఈ విషయమై చైనా మౌనం వహిస్తున్నది. చైనా నుండి 40 మంది వరకు చనిపోయి ఉండవచ్చని భారత్ సైనిక వర్గాలు భావిస్తున్నాయి. 

అయితే  35 మంది పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ఓ సీనియ‌ర్ అధికారి కూడా ఉన్న‌ట్లు యూఎస్ వెల్ల‌డించింది. గాల్వ‌న్ వ్యాలీలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన సైనికులు బాహాబాహీకి దిగారు. 

ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో మూర్తి చెందిన 20 మంది భార‌తీయ సైనికులలో   తెలంగాణ‌కు చెందిన సూర్యాపేట వాసి క‌ల్న‌ల్ సంతోశ్‌బాబు కూడా వీర‌మ‌ర‌ణం పొందారు.  తూర్పు ల‌డ‌ఖ్‌లోని పాంగ్‌గాంగ్ సో, గాల్వ‌న్ వ్యాలీ, డెమ్‌చోక్‌, దౌల‌త్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. భార‌త సైనికుల్లో న‌లుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.