చైనాతో ఘర్షణలో తెలుగు కల్నల్ మృతి

భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు తెలుగుబిడ్డే. తెలంగాణలోని సూర్యాపేట వాసి. 
 
ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీహార్‌ 16వ బెటాలియన్‌కు చెందిన సంతోష్‌ ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. 
 
 క‌ల్న‌ల్ సురేష్‌.. ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.  మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినా లాక్‌డౌన్‌ కారణంగా సరిహద్దుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.
 
సంతోష్‌ మృతిపై ఆయన తల్లి మంజుల మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తమ కొడుకు ప్రాణాలు అర్పించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అయితే ఓ తల్లిగా మాత్రం బాధపడుతున్నానని తెలిపింది.