పాక్‌లో అదృశ్యమైన ఇద్దరు భారత ఉద్యోగులు పాకిస్తాన్ ఐఎస్‌ఐ చెరలో ఉన్నారని ప్రభుత్వ అత్యున్నత వర్గాలు సోమవారం ప్రకటించాయి. ఇదే విషయంపై ఢిల్లీలోని పాక్ రాయబారికి కేంద్ర ప్రభుత్వం సమన్లు కూడా పంపినట్లు తెలుస్తున్నది.
కొన్ని రోజుల క్రితం గౌరవ్ అహ్లువాలియా అనే అధికారి వాహనాన్ని ఐఎస్‌ఐ సభ్యులు వెంబడించారు. పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం ఇండియన్ హై కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు అదృశ్యమయ్యారు.
అధికారిక పనిలో ఉన్న సమయంలో ఇద్దరు అధికారులు అదృశ్యమైనట్టు పాకిస్థాన్‌లోని ఇండియన్ హై కమిషన్ తెలిపింది.ఇటీవల పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు గూఢచార్యానికి పాల్పడిన కారణంగా భారత ప్రభుత్వం వారిని దేశం నుంచి బహిష్కరించింది.
ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత భారత హై కమిషన్‌కు చెందిన అధికారులు అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క ఇండియన్ హై కమిషన్ ఈ అంశాన్ని ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లింది.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ జయకేతనం