గత రెండు వారాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ తెలిపారు.
వైరస్‌ను నియంత్రించిన దేశాలు రెండో దఫా వ్యాప్తిని దృష్టిలో పెట్టకుని చర్యలు చేపట్టాలని ఆయన హెచ్చరించారు. బీజింగ్‌లో నమోదు అయిన కొత్త కేసులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత బీజింగ్‌లో కొత్తగా కోవిడ్19 కేసులు బయటపడ్డాయి. దీనిపై విచారణ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
చైనా అధికారులకు సహకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. తమ బృందాలను బీజింగ్‌కు పంపించనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ కేసులు తొలుత వుహాన్ నగరంలో బయటపడిన విషయం తెలిసిందే.
ప్రతి రోజూ లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి రెండు నెలల సమయం పట్టిందని, కానీ ఇప్పుడు ప్రతి రోజూ లక్షకుపైగా కేసులు నమోదు అవుతున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు.
ఇలా ఉండగా, వరుసగా మూడో రోజు 11 వేలకుపైగా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 11,502 కొత్త కేసులు, 325 మరణాలు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 3,32,424కు చేరాయి. మరణాల సంఖ్య 9520కి చేరింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
More Stories
ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
రష్యాలో పిల్లల కోసం భోజన విరామంలో శృంగారం
న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం