చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో జార్ఖండ్ కార్మికులు 

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో వ్యూహాత్మ‌క ప్రాంతాల‌కు క‌నెక్టివిటీ పెంచేందుకు కేంద్రం ప‌నులు వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగా ల‌ఢ‌ఖ్‌లో రోడ్డు నిర్మాణ ప‌నుల కోసం 1500 మందికి పైగా కార్మికుల‌తో జార్ఖండ్ నుంచి శ‌నివారం ప్ర‌త్యేక రైలు బ‌య‌లుదేరింది. ఈ రైలును దుమ్కా స్టేష‌న్‌లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ కార్మికుల‌ను ప్ర‌త్యేకంగా రిక్రూట్ చేసుకుని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) తీసుకుని వెళ్లింది. దీని సంబంధించి బిఆర్వో, , జార్ఖండ్ రాష్ట్ర కార్మిక శాఖ‌కు మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. ఎన్నో ఏళ్లుగా జార్ఖండ్ కార్మికులు గ‌డ్డ‌క‌ట్టే చ‌లి వాతావ‌ర‌ణంలోనూ లేహ్ లాంటి స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను దేశంతో క‌లిపే ప్రాజెక్టుల్లో ప‌ని చేటు సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనలో పాలుపంచుకొంటున్నట్లు సొరేన్ తెలిపారు. 

దేశం కోసం క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ శ్ర‌మిస్తున్న కార్మికుల సంర‌క్ష‌ణ‌, వారి హ‌క్కుల‌ను కాపాడ‌డం త‌మ బాధ్య‌త అని, వారి సంక్షేమం విష‌యంలో వెనుక‌డుగు వేయ‌బోమ‌ని స్పష్టం చేశారు. వారి ర‌క్ష‌ణ‌తో పాటు వ‌స‌తి, ఇత‌ర సౌక‌ర్యాల విష‌యంలో బోర్డ‌ర్ రోడ్స్ ఆర్డ‌నైజేష‌న్ బాద్య‌త తీసుకునేలా ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు.

ఇటీవ‌ల స‌రిహ‌ద్దుల్లో చైనా దుందుడ‌కుగా వ్య‌వ‌హ‌రిస్తూ భార‌త భూభాగంలోకి దూసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన నేప‌థ్యంలో ర‌క్ష‌ణ శాఖ వ్యూహాత్మ‌క రోడ్ల నిర్మాణాన్ని మ‌రింత వేగ‌వంతం చేసింది. ల‌ఢ‌ఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ప్రాంతాల్లో మ‌న సైన్యం ప‌నులు చేప‌ట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన చైనా ఆర్మీ మ‌న దేశ సైనిక‌, విదేశాంగ చ‌ర్చ‌ల త‌ర్వాత మ‌ళ్లీ వెనుక‌డుగేసింది. 

అయితే చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు నేప‌థ్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స‌రిహ‌ద్దు రోడ్ల నిర్మాణం స‌హా ఇత‌ర మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ క్ర‌మంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, జ‌మ్ము క‌శ్మీర్, ల‌ఢ‌ఖ్ ప్రాంతాల్లో ప‌నులు చేస‌ట్టేందుకు జార్ఖండ్ నుంచి అద‌నంగా దాదాపు 11,800 మంది కార్మికుల‌ను స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని బిఆర్వో నిర్ణ‌యించింది. 

జార్ఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చులు జ‌రిపి.. జూన్ 8న వారి రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్ర‌త్యేకంగా ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా తొలి ట్రైన్ ఈ రోజు 1648 మంది కార్మికుల‌తో ల‌ఢ‌ఖ్ బ‌య‌లు దేరింది. కరోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న ఈ స‌మ‌యంలో కార్మికుల‌ను ప‌నుల కోసం త‌ర‌లిస్తుండ‌డంతో అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.