
నేడు ప్రపంచం మొత్తాన్ని కలవరానికి గురిచేస్తున్న కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చికిత్స లభించడం కష్టమని అంతా చెబుతుంటే పంతంజలి సంస్థ నుండి ఆయుర్వేద మందు సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. నాలుగైదు రోజులలో ఈ విషయమై కీలక ప్రకటన చేయనున్నట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు.
కరోనాను ఆయుర్వేదంతో పూర్తిగా నయం చేయవచ్చని ఆయన ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా ఫలితాలు రాబట్టేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని నియమించామని, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
చాలామంది కరోనా పాజిటివ్ రోగులకు క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా చికిత్స చేశామని, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని పతంజలి సీఈవో ప్రకటించారు. తమ మెడిసిన్ వాడితే ఐదు నుంచి పద్నాలుగు రోజుల్లో కరోనా నెగిటివ్ వస్తుందని పతంజలి ఆచార్య బాలకృష్ణ భరోసా వ్యక్తం చేశారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూస్క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్