చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతోనూ సమావేశాలు జరిగాయని వివరించారు.
డెహ్రాడూన్‌లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ . నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందని విసావాసం వ్యక్తం చేసారు. నేపాల్‌తోనూ మనకు బలమైన సంబంధాలు ఉన్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
ఆ దేశంతో భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన లింకు ఉందని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య గట్టి బంధం ఉందని చెబుతూ భవిష్యత్తులోనూ నేపాల్‌తో బలమైన బంధం కొనసాగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ అంశంలో చాలా వరకు విజయం సాధించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. గత 15 రోజుల్లోనే సుమారు 15 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆయన చెప్పారు. కశ్మీర్‌లో పని చేస్తున్న అన్ని భద్రతా దళాల సమన్వయం వల్ల ఇది సాధ్యమైందని నరవాణే స్పష్టం చేశారు.
చాలా వరకు ఆపరేషన్స్ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే సాగుతున్నాయని తెలుపుతూ స్థానికులు ఉగ్రవాదంతో విసిగిపోయిన్నట్లు ఈ అంశం వెల్లడి చేస్తుందని తెలిపారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!