ఆర్ధిక వ్యవస్థ బలోపేతంకు అన్ని చర్యలు 

“ప్రధాన మంత్రి సూచించినట్లుగా మా మంత్రం `స్థానికం కోసం సర్వసం’ (వోకల్ ఫర్ లోకల్). ఆత్మా నిర్భర్ భారత్ ప్యాకేజీలో పేర్కొన్న సంస్కరణల ప్రతిపాదనలు అన్ని భారత దేశాన్ని ఆకర్షణీయైన పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి, భారత పారిశ్రామిక వేత్తలను, సంస్థలను ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి” అని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  కోవిడ్ -19 సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 

ప్రభుత్వ ఆర్ధిక ప్యాకేజి వెనుకగల ప్రయత్నాలను మీరు వివరించగలరా? 

వివిధ రంగాలకు చెందిన, దేశ వ్యాప్తంగా విస్తరించిన పలువురు సంబంధితులను సంప్రదించిన తర్వాత మా విధానాలను  రూపొందించారు. భారత దేశపు కోవిడ్ -19 ఆర్ధిక సంస్కరణలను, ఉపశమన కార్యక్రమాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించాము. మేము ప్రకటనలు చేసినప్పటి నుండి వాటి అమలు కోసం వివిధ చర్యలను వేగంగా తీసుకొంటున్నాము.

ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ చర్యలు సరిపోతాయని మీరు అనుకొంటున్నారా? 

భారత దేశపు ఆర్ధిక ప్యాకేజీని జీడీపీలో శాతంను బట్టి చూస్తే అతి పెద్ద ఆర్ధిక ప్యాకేజి ఇచ్చిన పెద్ద దేశాలలో మనం ఒకరం. రూ 20.97 లక్షల కోట్ల మొత్తంతో భారత దేశపు జీడీపీలో 10 శాతం మేరకు ఉంది. ప్రపంచం వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు భారత దేశం వలె మిళితమైన విధానాలు అమలు పరుస్తున్నాయి. ఆర్ బి ఐ తీసుకున్న వివిధ ఉద్దీపన చర్యలతో పాటు పలు వ్యవస్థాగత సంస్కరణలను కూడా తీసుకొంటున్నాము. 
 
ఈ ప్యాకేజి కింద రుణాలు ఇవ్వడానికి   బ్యాంకులు  సందేహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి
 
సమస్యలను పరిష్కరించి, ఆర్ బి ఐ ద్రవ్య విధానం మేరకు వినియోగదారులు ప్రయోజనాలు పొందే విధంగా చూడడం కోసం మేము ఎప్పటికప్పుడు బ్యాంకు ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నాము. 
 
ఎంఎస్ఎంఇ లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరిస్తే పరిష్కరించే ప్రత్యేక యంత్రాంగం అంటూ ఉందా?

నేను ఇంతకు ముందు చెప్పిన్నట్లుగా, మేము ఎప్పుడు బ్యాంకులతో సంప్రదిస్తూవునే ఉన్నాము. భారతీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం, బ్యాంకులు ఉన్నాయి. 
 
దేశంలో తీవ్రమైన ద్రవ్య సమస్య ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్య అందుబాటును, డిమాండ్ ను పెంచడం కోసం ప్రభుత్వం నేరుగా ప్రజలకు డబ్బు ఇచ్చి ఉండవలసిందనే అంశంపై మీ సమాధానం ఏమిటి?

ఉద్దేశించిన లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదిలీ ద్వారా ప్రజల చేతులలోకి డబ్బు అందేటట్లు చేస్తున్నాము. 20 కోట్లమందికి పైగా మహిళల జన్ ధన్ ఖాతాలను గలవారికి మొదటి వాయిదాగా రూ 20,000 కోట్ల మేరకు జమచేశాము. 2.82 కోట్ల మంది వృధాప్యపు, వితంతు, వికలాంగుల పెన్షన్ క్రింద రూ 2,807 కోట్లు జమచేశాము. పీఎం కిసాన్ పధకం క్రింద 9 కోట్ల మంది రైతులకు మొదటి వాయిదాగా రూ 18,000 కోట్లు జమచేశాము.  

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికులు తిరిగి రాకపోవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నదా? 

 
తమ స్వస్థలంలోనే ఉండాలి అనుకొంటున్నారా లేదా తిరిగి పనిచేస్తున్న రాష్ట్రాలకు వెళ్ళాలి అనుకొంటున్నారా అన్నది వలస కార్మికులకు సంబంధించిన అంశం. వారేమి అనుకున్నా, వారికి అవసరమైన మద్దతు అందిస్తాము. 

ఆత్మ నిర్భర్ భారత్ ఒక వంక విదేశీ పెట్టుబడులను   ఆకర్షించాలి అనుకొంటున్నది. మరోవంక స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి అనుకొంటున్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం ఉందా? 
 
ప్రధాన మంత్రి చెప్పిన్నట్లు మా మంత్రం `స్థానికం కోసం సర్వసం’. మొత్తం సంస్కరణలు అన్ని భారత్ ను ఆకర్షణీయమైన పెట్టుబడుల ప్రదేశంగా చేయడం కోసం, అదే సమయంలో భారతీయ పారిశ్రామిక వేత్తలను, సంస్థలను ప్రోత్సహించడం. 
 
చైనాను వదలాలని అనుకొంటున్న కంపెనీలను భారత్ కు ఆకర్షించే ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? 
 
చైనా నుండి మాత్రమే ఎందుకు? మొత్తం ప్రపంచానికి వ్యాపారాలను భారత్ తెరుస్తున్నది. నేడు సులభంగా వ్యాపారం చేసే రాంక్ లలో వేగంగా మెరుగవుతున్న దేశాలలో భారత్ ఒకటి. భారత్ ను ఒక అగ్రస్థాయి పెట్టుబడుల కేంద్రంగా చేయడం కోసం మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నేడు ప్రపంచం ఒక అంతర్జాతీయ గ్రామం. భారత్ ప్రపంచంలో తన ప్రభావాన్ని విస్తరిస్తున్నది. 
 
అనేక రంగాలలో ఉద్యోగులను తొలగించడం, జీతాలు కత్తిరించడం ఇప్పటికే జరుగుతున్నది. దీనిపై మీరేమంటారు? 
 
కంపెనీలకు అవసరమైన వర్కింగ్ కాపిటల్ రుణాలు, నియంత్రణ పరిష్కారాలను సమకూరుస్తున్నాము. వీటి వల్లన తమ ఉద్యోగులను కొనసాగించడానికి చాలామందికి వీలవుతుంది. అదనంగా, ఎంఎస్ఎంఇ లకు `నిధులకు నిధులు’ ద్వారా ఈక్విటీ రూపంలో రూ 50,000 కోట్ల రూపంలో సమకూరుస్తున్నాము. మరింకా, దివాళా కోడ్ లోని సెక్షన్ 7,9,19లను ఒక సంవత్సరం పాటు రద్దు చేయడం ఎంఎస్ఎంఇ లకు, ఇతర వ్యాపారాలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.