భారత దేశంలో టివి చరిత్రలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న 33 ఏళ్ల క్రితం రామానంద్ సాగర్ రూపొందించినన రామాయణం సీరియల్ ఇప్పుడు తెలుగులో ప్రసారం కాబోతున్నది. రామాయణం సీరియల్‌ని స్టార్ మా ఛానెల్‌లో తెలుగులో ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
జూన్ 15 నుండి సాయంత్రం 5.30ని.లకి (సోమవారం నుండి శుక్రవారం) తెలుగు డబ్బింగ్ వర్షెన్ ప్రసారం కానుందని ప్రోమో ద్వారా తెలియజేశారు. 14 ఏళ్ళు రాముడు,సీత, లక్ష్మణుడు వనవాసంకి సంబంధించిన ప్రయాణాన్ని సీరియల్‌లో ఎంతో చక్కగా చూపించారు.
లాక్‌డౌన్ వలన ఈ సీరియల్‌ని పునః ప్రసారం చేశారు. రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధిక మంది వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది. ఏప్రిల్ 16న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది వీక్షించారని ప్రసార భారతి కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
తరాలు మారిన కూడా ప్రతి ఒక్కరిని అలరిస్తున్న పౌరాణిక కార్యక్రమంలో అరుణ్ గోవిల్ శ్రీరాముని పాత్ర పోషించారు. దీపిక చికాలియా సీతగా, సునీల్ లహరి..లక్ష్మణుడిగా, అరవింద్ త్రివేది రావణుడిగా, దారా సింగ్ నుమంతుడి పాత్రలో కనిపించి మెప్పించారు
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’