ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఎంఐఎం నేత ఒకరు విజ్ఞప్తి చేశారు. గో వధకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఆర్డినెన్స్ జారీ చేయడంపై స్పందిస్తూ అస్సాం ఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ ఈ సూచన చేయసారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి తో పాటు బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులందర్నీ ఈ విషయమై చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. పాలు ఇవ్వని గోవుల్ని అమ్ముకుంటూ వాటిని వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని శిక్షించడమే కాదు రూ.20 లక్షల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.
అయితే గోవుల్ని రక్షించడంలో కేంద్రం, యూపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గోవుల్ని అమ్మకం దారుల వద్ద కొనుగోలు చేసి, గో శాలల్ని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులను కోరారు. అంతేకాక గోవులు వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ ను తింటున్నాయని, మురుగు నీటిని తాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
More Stories
హైడ్రామా మధ్య అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో వైద్య విద్య
శబరిమల భక్తుల కోసం ’స్వామి’ ఏఐ చాట్‌బాట్