కరోనా కలకలంతో తెలంగాణ సీఎంఓ బంద్

తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభణతో అల్లకల్లోలం అవుతున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో వైరస్ అదుపు తప్పింది అనూహ్యంగా టెస్ట్ లు తగ్గినా కేసులు పెరిగి పోతున్నాయి. దానితో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

తాజాగా ముఖ్యమంత్రి  కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్​లోని బేగంపేట మెట్రోభవన్ లో ఉన్న సీఎం ఆఫీసులో కరోనా భవన్‌లో పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో సీఎంవో ఆఫీసుకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో కొద్దిరోజుల పాటు సీఎంవో కార్యాలయం బంద్ కానుంది. కార్యదర్శులు ఇళ్ల వద్ద నుండే ఫైల్స్ చూస్తున్నట్లు తెలుస్తున్నది ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు  రాజీవ్ శర్మ మెట్రో భవన్ కు రావడం మానేశారని, కాలుష్య నివారణ బోర్డు చైర్మన్ గా కూడా ఉండటంతో అక్కడికే వెళ్తున్నారని అధికారులు చెప్తున్నారు.

ఇప్పటి వరకూ మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించింది. వీరిలో  సీనియర్ ఐఏఎస్ అధికారులు, పేషీ స్టాఫ్, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

రెండు రోజుల కింద ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వద్ద పనిచేసే పర్సనల్​ సెక్రెటరీకి జ్వరం వస్తే హాస్పిటల్​కు వెళ్లారు. అక్కడ టెస్టుల్లో కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ చేశారు. ఆ వ్యక్తి కుమారుడు ఇటీవలే ముంబై నుంచి వచ్చాడని, అతని ద్వారానే వైరస్​సోకిందని అధికారులు గుర్తించారు.

ముందు జాగ్రత్తగా సీఎంవోలోని మిగతా సిబ్బందికి టెస్ట్ చేస్తున్నారు.  సీఎంలోలో పని చేస్తున్న వారిలో 55 సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో సీఎంవోలో తీవ్ర ఆందోళన నెలకొంది. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  కాకుండా మిగిలిన తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరపడానికి హై కోర్ట్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పరీక్షలనే వాయిదా వేసింది. దానితో నగరంలో పరిష్టితులు అదుపు తప్పుతున్నట్లు వెల్లడి అవుతుంది.