మావోయిస్టులకు 1.20 కోట్లు తరలిస్టుల్ల కాంట్రాక్టర్లు అరెస్ట్ 

మావోయిస్టుల‌కు భారీగా డ‌బ్బు త‌ర‌లిస్తున్న‌ తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు కాంట్రాక్ట‌ర్లను  తెలంగాణ – మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌హారాష్ట్ర‌లోని గ‌చ్చిరోలి అట‌వీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల‌కు ఇద్ద‌రు కాంట్రాక్ట‌ర్లు భారీగా న‌గ‌దు అందించేందుకు రాత్రి స‌మ‌యంలో కారులో వెళ్లారు.

అయితే తెలంగాణ నుంచి మ‌హారాష్ట్ర‌లో ప్ర‌వేశించిన కొద్దిసేప‌టికి అక్క‌డి పోలీసులు త‌నిఖీలు చేశారు. ఈ స‌మ‌యంలో భారీగా రూ. కోటి 20 ల‌క్ష‌ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక స్కార్పియో, రెండు సెల్ ఫోన్ల‌ను సీజ్ చేశారు మ‌హారాష్ట్ర పోలీసులు. ఈ సొమ్ము తీసుకెళ్తున్న ఇద్ద‌రు తెలంగాణ కాంట్రాక్ట‌ర్ల‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.

మ‌రి కొన్ని గంట‌లైతే ఆ డ‌బ్బు మావోయిస్టుల చేతిలోకి వెళ్లిపోయుండేద‌ని వారు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఆ సొమ్మును వారు ఎందుకు తీసుకెళ్తున్నారు, మావోయిస్టుల నుంచి ఏమైనా బెదిరింపులు వ‌చ్చాయా? లేక మ‌రేదైనా జ‌రిగిందా అన్న దానిపై ఎంక్వైరీ చేస్తున్న‌ట్లు చెప్పారు.