
* ఇస్లామిక్ మత మార్పిడి తో తస్మాత్ జాగ్రత్త!
పహల్గామ్ సంఘటనలో మతం అడిగి, హిందువు అని నిర్దారించుకుని 26 మందిని పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు క్రూరంగా హత్య చేసిన తరువాత ముస్లింల మత ఉగ్రవాదంపై నేడు దేశం మొత్తం మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ, దొరికిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే అనే చర్చ నడుస్తున్నది.
ఈ నేపథ్యంలో భారతదేశం పాకిస్థాన్‌లోను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోను ఉన్న ఉగ్రమూకల భరతం పట్టింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. ఈ సందర్భంలో మన గూఢచారి సంస్థలు భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్ గురించి హెచ్చరికలు చేశారు. 12 మందిని అరెస్ట్ కూడా చేశారు. అందులో ప్రముఖ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ మన దేశ సున్నితమైన రక్షణ రహస్యాలను పాకిస్థాన్‌కు అందజేసిందని పోలీస్ వారు నిర్థారించారు.
ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి మతం లేదు అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవారు ఇప్పుడు “ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ద్రోహం చేస్తున్నారు” అంటూ జ్యోతి మల్హోత్రా హిందువే అయినప్పటికీ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసింది కదా అని ఎత్తిచూపుతున్నారు. మనం జ్యోతి మల్హోత్రా విషయంలో ఒక విషయాన్ని గమనించాలి.
ఈమె ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లో పనిచేసే ఎహసాన్-ఉర్-రహీమ్ (డానిష్ అని పిలువబడే వ్యక్తి)తో సంబంధం ఏర్పరచుకుంది. అతనితో శారీరక సంబంధం పెంచుకొని రెండవ భార్యగా వివాహం కూడా చేసుకుని, సరదాగా బాలి ద్వీపానికి విహారయాత్రకు కూడా వెళ్లి వచ్చింది. ఈమె 2023లో పాకిస్థాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా హాజరైంది. ఆ విందులో ఎహసాన్-ఉర్-రహీమ్‌తో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది.
ముస్లింతో శారీరక సంబంధం ఏర్పడింది అంటే వారి ప్రోద్బలంతో ఒక రకంగా ఆమె లవ్ జిహాద్‌కు గురి అయ్యిందని అర్థం. హిందువుగా ఉంటూనే ఇస్లాం ప్రభావానికి లోనై దేశ ద్రోహానికి పాల్పడింది. జ్యోతి మల్హోత్రా చేసిన దేశద్రోహం తర్వాత, ఇంకో హిందూ మహిళ గుర్తుకు వస్తుంది. ఈమె పేరు మాధురీ గుప్తా, భారతీయ విదేశాంగ సేవలో సీనియర్ అధికారిణి. ఆమె వయస్సు 52 సంవత్సరాలు, కానీ అవివాహితురాలు. మాధురీ గుప్తా ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియా సహా అనేక దేశాలలో సీనియర్ పదవులలో పనిచేశారు.
ఉర్దూపై మంచి పట్టు ఉండటం వల్ల ఆమెను పాకిస్తాన్‌కు పంపారు. అక్కడ ఆమెకు వీసాతో పాటు మీడియా బాధ్యతలు కూడా అప్పగించారు. పాకిస్తాన్లో నియమితులైన అధికారులందరిపైనా నిఘా సంస్థల కన్ను నిరంతరం ఉంటుంది. ఒక పార్టీలో మాధురీ గుప్తా జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడిని కలిసింది. ఆ యువకుడు తన వాక్చాతుర్యం, చురుకైన మాటలతో మాధురీ గుప్తా హృదయాన్ని గెలుచుకున్నాడు.
మాధురీ గుప్తా కూడా అతనిని ప్రేమించింది. అంతే కాదు, మాధురీ గుప్తా ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించి జవేరియాగా కూడా పేరు మార్చుకున్నది. ఈ పరిణామంతో మాధురీ గుప్తాపై నిఘా మరింత తీవ్రమైంది. ఆమె ఇ-మెయిల్స్, ఫోన్లు నిఘాలో ఉంచారు. మాధురీ గుప్తా జంషెడ్ అనే వ్యక్తి ప్రేమలో దేశద్రోహిగా మారిందని, ఆమె భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని జంషెడ్‌కు చేరవేస్తోందని తెలిసింది.
వాస్తవానికి, జంషెడ్ ఐఎస్ఐ గూఢచారి. ఐఎస్ఐ అతనికి శిక్షణ ఇచ్చింది. మాధురీ గుప్తా 52 ఏళ్ల వయస్సులోను అవివాహితురాలిగా ఉందని తెలుసుకున్న తర్వాత, ఆమె తప్పకుండా ఒక సహచరుడి కోసం చూస్తుందని భావించి ఆమెను వలలో వేయడానికి జంషెడ్‌ను నియమించింది. ఆ తర్వాత, ఆమెను భారతదేశానికి పిలిపించి అరెస్టు చేశారు. తను చేసిన తప్పులకు సంబంధించిన అన్ని ఆధారాలు చూపించగా చివరికి తన నేరాన్ని అంగీకరించింది. మాధురికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఈ దేశద్రోహి దిక్కులేని చావు చచ్చింది.
ఇక 2017లో ఒక ఐసిస్ తీవ్రవాదిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతని పేరు కొనకళ్ల సుబ్రమణ్యం. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను ఇంటర్ చదువుతున్నప్పుడు తన ముస్లిం మిత్రులచే ప్రభావితం అయ్యాడు. 2014లో సుబ్రహ్మణ్యం డిగ్రీ చదువుతున్నప్పడు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఒమర్గా పేరు మార్చుకున్నాడు. తర్వాత సిద్దాపూర్ గ్రామం మదర్సాలో 9 నెలలు పని చేసాడు.
ఇదే సమయంలో ఇస్లాం మతపరమైన శిక్షణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌కి, తమిళనాడులో ఉన్న అంబురు మాదర్సాకి వెళ్లాడు. తరువాత హైద్రాబాద్‌కు వచ్చి టోలిచౌకి ప్రదేశంలో నిమ్మకాయ సోడా వ్యాపారం చేస్తూ ముంబైలో ఉంటున్న ఐసిస్ సానుభూతిపరుడు అబూ కహాఫా ఆల్ హిందీతో సంబంధాలు పెట్టుకుని ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అతనితో కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసాడు.
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇలా ముస్లింలనే గాక, ఆర్ధిక ఇబందులు, ఇతరేతర సమస్యలున్న హిందువులను మభ్యపెట్టి, హైందవ మతం పట్ల వైముఖ్యం కలిగేలా తార్కిక రీతిలో మనసు మార్చి దేశ వ్యతిరేకులుగా వీరిని ప్రయోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హిందువుల బాధ్యత ఏమిటంటే, తమ ధర్మం, కర్తవ్యం గురించి మాత్రమే గాక, అన్యమతాల చరిత్రను గురించి పెద్దల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుని ఏది నిజమో గ్రహించాలి.
హిందువులెవరైనా అన్యమతస్తుల ప్రభావంలోకి వెళుతున్నట్లయితే, కచ్చితంగా వారి ప్రవర్తనలోను, జీవనశైలిలోను మార్పులను చూడవచ్చు. మీ సహోద్యోగులు, బంధుమిత్రుల్లో ఇలాంటి వారిని గమనించినప్పుడు వెంటనే అప్రమత్తమై పెద్దల దృష్టికి తీసుకురావాలి. పరిస్థితి చేయి దాటిపోకుండా దేశాన్ని కాపాడుకునే దిశగా మనందరం కలసికట్టుగా అడుగులు వెయ్యాలి.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన