కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం లక్షద్వీప్ దీవులను సందర్శించే వారి సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగినట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రభావవంతమైన నాయకుడు. డిసెంబర్ 2023లో లక్షద్వీప్ దీవులను మోదీ సందర్శించారు. ఆయన పర్యటనతో లక్షద్వీప్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ, విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు.
ప్యాకేజీల గురించి మరింత తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఆన్లైన్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు’ అని అక్కడి పర్యాటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తెలిపారు.

More Stories
హిమాచల్‌లో ‘వితంతు’, `అనాధ’ల కోసం సెస్
జార్ఖండ్‌లో ఒకొక్క ఉద్యోగం కోసం రూ 70 లక్షల వరకు
టాటా సన్స్ ఛైర్మన్ రేసులో టీవీ నరేంద్రన్