టాటా సన్స్ ఛైర్మన్ రేసులో టీవీ నరేంద్రన్

టాటా సన్స్ ఛైర్మన్ రేసులో టీవీ నరేంద్రన్

టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి నటరాజన్ చంద్రశేఖరన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో టాటా గ్రూప్ నాయకత్వంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఛైర్మన్ పదవి ఎవరు చేపడతారనేది కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ పదవి రేసులో టీవీ నరేంద్రన్ పేరు వినిపిస్తోంది.

61 ఏళ్ల వయసు ఉన్న టీవీ నరేంద్రన్ ప్రస్తుతం టాటా స్టీల్ విభాగానీకి సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టాటా సన్స్ తదుపరి ఛైర్నన్ పదవికి ఈయన పేరు అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనవైపే మొగ్గు చూపవచ్చనే ప్రచారం జరుగుతోంది. తిరుచిలోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన నరేంద్రన్ ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

 
1988 నుంచి టాటా గ్రూప్‌లో దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడే పని చేస్తున్నారు.  మొదట్లో సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో పని చేసిన నరేంద్రన్, ఆగ్నేయాసియాలో టాటా స్టీల్ విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని చెబుతారు. 2013లో టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సీఈఓగా పదోన్నతి పొందారు. 
 
అయితే టాటా సన్స్ తదుపరి చైర్మన్ రేసులో నోయల్ టాటా,  సౌరభ్ అగర్వాల్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. చంద్రశేఖరన్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోపు కొత్త ఛైర్మన్ ఎంపిక పూర్తి చేయాల్సి ఉంటుంది.  అధిక అప్పులు, అస్థిరమైన ఉక్కు మార్కెట్లు మరియు అంతర్జాతీయ కార్యకలాపాలకు సంబంధించిన ఇబ్బందులతో కూడిన సవాలుతో కూడిన కాలాల్లో కూడా నరేంద్రన్ టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు.
ఆయన పదవీకాలంలో, యూరప్‌లోని సంక్లిష్ట సమస్యలను అధిగమిస్తూనే, కంపెనీ నగదు ప్రవాహాలను మెరుగుపరచడం, అప్పులను తగ్గించడం,  దేశీయ వ్యాపారాన్ని బలోపేతం చేయడంపై పనిచేసింది. వివిధ పరిశ్రమలు, భౌగోళిక ప్రాంతాలలో పనిచేస్తున్న వ్యాపారాలను పర్యవేక్షించడంతో పాటు, ప్రపంచ మార్కెట్లు, నియంత్రణలు, దీర్ఘకాలిక మూలధన కేటాయింపులపై అవగాహన అవసరమయ్యే టాటా సన్స్ ఛైర్మన్ పాత్రకు ఆ అనుభవం ముఖ్యమైనది కావచ్చు.
టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌కు 3 సవాళ్లు ఎదురుకానున్నాయని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ప్రస్తుతం ఎయిరిండియా, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా డిజిటల్ సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా ఏకంగా రూ.22,238 కోట్ల నష్టాలను చవిచూసింది. అహ్మదాబాద్ ప్రమాదం, పశ్చిమాసియా యుద్ధం వంటి వాటితో భారీగా నష్టపోయింది. ఇక టాటా డిజిటల్ ఆదాయం పెరిగినా నష్టాలు దాదాపు రూ.5 వేల కోట్లకు చేరాయి.  బిగ్ బాస్కెట్ 10 మినట్ డెలివరీ ఆలస్యమవడ ప్రతికూలంగా మారింది.