సీజే చంద్రచూడ్‌కు గన్ ఇచ్చి మణిపూర్ పంపిద్దామని, అక్కడ ఆయన శాంతి స్థాపన చేస్తాడో లేదో చూద్దామని శేషాద్రి తన ఇంటర్వ్యూలో విమర్శించారు. మణిపూర్ అనేది కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతమని, క్లిష్టమైన ఆ ప్రాంతంలో మర్డర్లు కూడా ఎక్కువే జరుగుతుంటాయన్నారు. ఆ హింసను మనం ఆపలేమన్న రీతిలో శేషాద్రి వ్యాఖ్యలు చేశారు.
అడ్వకేట్ కవియరాసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేషాద్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుప్రీంకోర్టు, సీజేఐ చంద్రచూడ్‌ను విమర్శించడం సరికాదు అని ఆ ఫిర్యాదులో కవియరాసు పేర్కొన్నారు. మరో వైపు బద్రి శేషాద్రి అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఖండించారు. సామాన్య ప్రజానీకాన్ని తమ అభిప్రాయాలను చెప్పకుండా అధికార డీఎంకే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. పాలక ప్రభుత్వ ప్రతీకార ఎజెండాను అమలు చేయడమే పోలీసుల బాధ్యతా అని ఆయన ప్రశ్నించారు.

More Stories
సిపిజే నేతల కేసు విచారణలో ఫ్రాన్స్ అల్లర్లను ప్రస్తావించిన హైకోర్టు
సిపిజే నిరసనలపై ఐరాస వ్యాఖ్యలను తిరస్కరించిన రూబియో
జింబాబ్వేపై భారత్ మహిళల ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్