పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్‌ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2021, డిసెంబర్లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జి జాతీయ గీతాన్ని అగౌరవపర్చారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ నేపథ్యంలో తాను నేరం చేయలేదని, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మమతాబెనర్జి అప్పీల్ చేశారు. ఆ అప్పీల్‌ను తాజాగా కోర్టు తోసిపుచ్చింది. 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవ పరిచినందుకు మమతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బీజేపీ నేత మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు.
ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కోర్టుకు సమర్పించారు. అనంతరం ఈ అంశం బాంబే హైకోర్టుకు చేరింది. మమత ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆమె లేచి నిలిబడలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

More Stories
మారుమూల గిరిజన ప్రాంతాలు, సరిహద్దుల్లో కూడా ఆర్ఎస్ఎస్ విస్తరణ
మహిళల ధైర్యానికి, ఆత్మగౌరవానికి ‘జౌహర్’ ప్రతీక
బెంగాల్లో రెండు విడతలు, నాలుగు చోట్ల ఒకే దశలో పోలింగ్