ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడం పట్ల గతంలో పలుసార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదేశాలిచ్చిన ఇంకా కొనసాగిస్తూ ఉండడం పట్ల ఎపి హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వాయ్కతం చేసింది. తాజాగా కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేయడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్య నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు, వైసీపీ రంగులు వేస్తున్నారు అంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను విచారించింది. ఇటువంటి రంగులు వేయవద్దు అంటూ గతంలో హైకోర్టుతో పాటుగా, సుప్రీం కోర్టు కూడా ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేస్తూ, ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విధంగా రంగులు వేసినందుకు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మ్యనేజింగ్ డైరెక్టర్ కూడా, 16వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందుకు హాజరు కావాలని చెప్పి, కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని, తాము వ్యక్తిగతంగా దీని పై వివరాలు తీసుకుని, సవివరంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఇరువురిని కోర్టుకు పిలవద్దు అని చెప్పినా కూడా హైకోర్టు ధర్మాసనం, ఆయన విజ్ఞప్తని ఖాతరు చేయలేదు.
హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నా కూడా, ఇది అతి పెద్ద చర్చకు దారి తీసిన అంశం అయినా కూడా, మళ్ళీ ఈ విధంగా ఎందుకు పార్టీ రంగులు వేసుకుంటున్నారు అనేది, వారి నుంచి తాము వివరణ కోరతామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారులకు, కోర్టుల ఆదేశాలు అంటే లెక్క లేదా అనే అభిప్రాయం, ఈ సంఘటనతో మరోసారి కలుగుతుంది.

More Stories
2027 పుష్కరాల లోపు పోలవరం పూర్తికి సహకరించండి
కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పనులపై ఉద్రిక్తత
యూరియా, డిఎపి ఎరువుల వినియోగంపై నిఘా