రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఎస్సీ కమిషన్ సభ్యులు అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్దర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలపై దాడులు, అత్యాచారాలకు సంబంధించి అందిన వినతులపై తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
రమ్య హత్య కేసులో గుంటూరు డీఐజీ నేతృత్వంలోని అధికారుల బృందం సత్వరమే స్పందించిందని తెలిపారు. కాగా, ఎస్సీ కమిషన్ బృందం భేటీలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటనలో యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్ నమోదు చేశామని చెప్పారు. కాగా, జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.

More Stories
రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను
తిరుపతిలో 600 ఎకరాలలో ధార్మిక టౌన్ షిప్