
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు చేరాయి. ఇందులో 2,56,92,342 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 20,26,092 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 3,29,100 మంది మహమ్మారి వల్ల మరణించారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2,38,022 మంది వైరస్ నుంచి బయటపడగా, కొత్తగా 3128 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 4 తర్వాత అతి తక్కువ మరణాల సంఖ్య ఇదేనని పేర్కొంది. రికవరీ రేటు 91.60 శాతానికి పెరగగా, పాజిటివిటీ రేటు 9.04 శాతానికి తగ్గిందని తెలిపింది.
ఇటీవల అత్యధికంగా కరోనా కేసులు నమోదైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అసోంల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశంలో కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి.
సింగల్ డోసు ప్రభావంపై పరిశీలన?
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!