మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందేనని వైఎస్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ హత్యపై సీఎం జగన్, షర్మిల, తనిది ఒకే మాట అని తేల్చి చెప్పారు. ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఇప్పటివరకు ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని విమర్శించారు.
పవన్ వ్యాఖ్యలపై విజయలక్ష్మి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వానిదని, పవన్ విమర్శలు అర్ధరహితమని లేఖలో విజయలక్ష్మి కొట్టిపారేశారు. ఇటీవల వివేకానందరెడ్డి హత్యకేసులో జరుగుతున్న విచారణపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదని వాపోయారు. ఈ విషయంపై ఆమె నేరుగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్లను కూడా.. తాను హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నానని తెలిపారు. వైఎస్ షర్మిల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో కొందరి మద్దతు కూడా తమకుందని పేర్కొన్నారు. జగన్ సీఎంగా ఉన్నా కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదో.. ఆయన్నే అడిగితే బాగుంటుందని సునీతారెడ్డి చెప్పారు.
కాగా, జగన్ పట్టించుకోవడం లేదని, తమ కుటుంబంలో విబేధాలున్నాయని దుష్ప్రచారం చేయడం తగదని విజయమ్మ సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. పై రెండు ఘటనలూ చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు జరిగాయని రాష్ట్ర ప్రజలకు తెలిసినా… తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పలువురు దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

More Stories
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఒక్కరోజే 30 మంది మృతి
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు
ఎస్ఐఆర్ లో నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు