సినీ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. పలు సినిమాల్లో ఆయన కామెడీ, విలన్ పాత్రలు పోషించిన నర్సింగ్ యాదవ్తె లుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 300 సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
విజయనిర్మల దర్శ కత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి నర్సింగ్ యాదవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది.
రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి కేరక్టర్ చేశారు. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

More Stories
శంషాబాద్ ఎయిర్పోర్టులో 11.5శాతం తగ్గిన ప్రయాణికులు
కదం తొక్కిన బీజేపీ మహిళా మోర్చా ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’
హైడ్రా, తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు