ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌!

ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌!
పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్‌వోలపై నోరుపారేసుకున్న ఆయన ఇప్పుడు ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ను ‘క్రిమినల్‌ వేస్ట్‌’ అంటూ వాళ్ల ఇజ్జత్‌ తీసే వ్యాఖ్యలు చేశారు. “సంవత్సరానికి1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికీ జాబ్‌ చేసే స్కిల్‌ లేదు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృథా. తెల్లకాగితం ఇచ్చి ఉద్యోగం కోసం అప్లికేషన్‌ ఫారం ఇస్తే పూరించే పరిస్థితిలో లేరు” అంటూ కించపరిచేలా మాట్లాడారు. 
 
జర్మనీ, ఫిన్లాండ్‌లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌ గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమై మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్‌ పూర్తయిన విద్యార్థి ఉంటే ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి. రాయలేరు. అలాంటివారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలెలా వస్తాయి? ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థిదే కాదు. వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్లూ సరిగా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగా చెబితే ఎందుకు నేర్చుకోరు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 24వేల విద్యార్థులు ఉన్నారని, వారిలో నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపును తాను బాధ్యతగా తీసుకున్నానని, విద్యాశాఖలో ప్రక్షాళన కోసమే నా వద్ద పెట్టుకున్నానని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా సగటున రూ.1.08 లక్షలు వ్యయం చేస్తోందని, అంత ఖర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలని ఉపాధ్యాయులకు సూచించారు.  

తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు పంపుతున్నామని తెలిపారు. ఏటా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్టాన్‌ఫోర్డ్‌, హార్వర్డ్‌ వంటి వర్సిటీల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఆ నైపుణ్యాలతో ఇక్కడ విద్యార్థులకు బోధించి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని కోరారు. 

ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే వెనుకబాటుతనమని తాము నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కులసర్వే తేల్చిందని సీఎం రేవంత్‌ చెప్పారు. ఉపాధ్యాయులు ఏ మండలానికి ఆ మండలం యూనిట్‌గా తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. డిసెంబరు నెలాఖరుకు ప్రణాళికలను తమకు అందజేస్తే వాటికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.