ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతికి గౌరవం ఇవ్వడం కూడా ఇబ్బందిగా భావించడం సరైంది కాదని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం బీజేపీ, మధ్యాహ్నం బీజేపీ, రాత్రి బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రామచందర్ రా
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు తప్ప కాంగ్రెస్ నాయకులకు మరో ఆలోచన కనిపించడం లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా బలపడుతుండటంతో కాంగ్రెస్ నాయకత్వంలో భయం పెరిగింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 104.41 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, అందులో తెలంగాణ నుంచే 55.31 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారని చెప్పారు.
అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో సగానికి పైగా తెలంగాణ నుంచే ఉందని స్పష్టం చేశారు. ఎంఎస్పీ కింద దేశవ్యాప్తంగా రైతులకు చెల్లించిన మొత్తం సుమారు రూ.21,243 కోట్లు కాగా, అందులో తెలంగాణ రైతులకు మాత్రమే రూ.13,171 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఎంఎస్పీ ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య దేశవ్యాప్తంగా 11.69 లక్షల మంది కాగా, అందులో 7,79,358 మంది తెలంగాణ రైతులే అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతోందని పేర్కొంటూ ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పమని సవాల్ చేశారు. మార్చి 25 నుంచే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించలేదని, అంటే దాదాపు నెల రోజులకు పైన రైతులను కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందిపెట్టారని విమర్శించారు.

More Stories
పవర్ టూల్స్ రంగంలో భారత ఆత్మనిర్భరత
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
అణ్వాయుధాలలో పాకిస్థాన్ ను అధిగమించిన భారత్