భారతదేశం తన అణ్వాయుధాలను పాకిస్తాన్‌ను మించి విస్తరించిందని, జనవరి 2026 నాటికి సుమారు 190 వార్‌హెడ్‌లను కలిగి ఉందని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (ఎస్ఐపీఆర్ఐ) తెలిపింది. మరోవైపు, పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు కొనసాగుతున్నాయి. తన ‘ఇయర్‌బుక్ 2026’ నివేదికలో, 2025 నాటికి భారతదేశ అణ్వాయుధాల నిల్వ 10 పెరిగి, 180కి చేరిందని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. వీటిలో 12 వార్‌హెడ్‌లు ఇప్పటికీ వినియోగంలోనే ఉన్నాయి.
అందుకు విరుద్ధంగా, 2025 నాటికి పాకిస్తాన్ నిల్వ 170గా ఉంది. ఆ దేశం కొత్తగా ఏమీ జోడించలేదు. ఇక చైనా వద్ద నిల్వల్లో 620 వార్‌హెడ్స్ ఉన్నాయి. గత ఏడాది ఆ దేశం వద్ద 600 మాత్రమే ఉండే అని స్టాక్‌హోమ్ రీసర్చ్ సంస్థ తెలిపింది. 2025లో భారత్, పాకిస్థాన్ దేశాలు కొత్త తరహా అణ్వాయుధ డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ల్యాండ్, ఎయిర్ సామర్థ్యంలో బాగానే ఉన్నా సముద్ర సామర్థ్యాన్ని పాక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. రాబోయే దశాబ్ధంలో తన అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పాక్ పెంచుకోనున్నదని రిపోర్టులో పేర్కొన్నారు. బాలిస్టిక్ క్షిపణులకు వార్‌హెడ్స్‌ను అమర్చే సామర్థ్యాన్ని కూడా ఆ దేశాలు పెంచుకున్నట్లు పేర్కొన్నది. భారత్, చైనా దేశాలు తమ వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకున్నట్లు ఆ నివేదికలో చెప్పారు.
భారతదేశ ఆధునీకరణ కార్యక్రమం గురించి కూడా ఇది ప్రస్తావించింది. ఈ కార్యక్రమం ‘చైనా అంతటా లక్ష్యాలను చేధించగల సుదూర ఆయుధాలను అభివృద్ధి చేయడం’పై దృష్టి సారించిందని నివేదిక తెలిపింది. అయితే, భారతదేశం పాకిస్థాన్‌తో తన ‘దీర్ఘకాలిక వైరం’పైనే దృష్టి సారిస్తోందని సిప్రి ఇయర్‌బుక్ 2026 పేర్కొంది. పాకిస్థాన్ గురించి ఆ నివేదిక చెబుతూ, 2025లో ఇస్లామాబాద్ ‘కొత్త డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేసి, విచ్ఛిన్నమయ్యే పదార్థాలను పోగుచేసుకుందని’, ఇది రాబోయే దశాబ్దంలో తన ఆయుధాగారాన్ని విస్తరించుకునే అవకాశం ఉందని సూచిస్తోందని తెలిపింది.
భారత్ తన యుద్ధ విమానాలు, నేల నుంచి ప్రయోగించే మిస్సైళ్లు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గామిలకు న్యూక్లియర్ వెపన్స్‌ను అమర్చినట్లు కూడా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా అదనపు మిస్సైళ్ల కోసం మరికొన్ని వార్‌హెడ్స్‌ను కూడా తయారు చేస్తున్నట్లు సిప్రి తన రిపోర్టులో చెప్పింది. ఆ వార్‌హెడ్స్ ఉన్న క్షిపణులను కంటేనర్లకు తరలిస్తున్నట్లు కూడా రిపోర్టులో చెప్పారు.
స్టాక్‌హోమ్ సంస్థ అంచనాల ప్రకారం 2026 జనవరి నాటికే స్వల్ప సంఖ్యలో ఉన్న వార్‌హెడ్స్‌ను ఇండియా తన జలాంతర్గాములకు తరలించినట్లు తెలుస్తోంది. జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు స్టాక్‌హోమ్ సంస్థ తెలిపింది. మిలిటరీ వద్ద 9745 ఆయుధాలు ఉన్నాయని ఆ నివేదికలో చెప్పారు.
ఇక 4012 మాత్రం క్షిపణులు, ఎయిర్‌క్రాఫ్ట్ లో నిక్షిప్తం చేశారు. రష్యా, అమెరికా దేశాలు సుమారు 2200 ఆయుధాలను హై అలర్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
భారత్, చైనా దేశాలు కూడా హై ఆపరేషనల్ అలర్ట్‌లో వార్‌హెడ్స్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ దేశాల వద్ద ఎంఐఆర్వీ టెక్నాలజీ ఆయుధాలు ఉన్నాయి. ఇక భారత్, పాక్, ఉత్తర కొరియా ఆ టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని భావిస్తున్నారు. భారత్ కూడా ఇటీవల అగ్ని-5 మధ్యంతర క్షిపణి ద్వారా ఎంఐఆర్వీ టెక్నాలజీని పరీక్షించింది. మరోవైపు పాక్ మీడియం రేంజ్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నది.

More Stories
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం
కేంద్ర మంత్రితో, సీఎంతో 11 మంది టిఎంసి ఎంపీల భేటీ!