ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్‌పై “మరింత శిక్షాత్మక” దాడులను ప్రారంభించిన తర్వాత, విదేశాంగ కార్యదర్శి సోమవారం ఈజిప్ట్ నుండి తూర్పు వైపు, ఇజ్రాయెల్‌తో సహా మధ్యప్రాచ్యం మొత్తాన్ని వెంటనే విడిచిపెట్టాలని అమెరికా అమెరికన్లను కోరింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది అమెరికా.
బహ్రైన్, కువైట్, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, జోర్డాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాల్లోని పౌరులు వెంటనే దేశాలు విడిచిపెట్టాలని సూచించింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. రెండు డ్రోన్లతో అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి జరిగిందని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో మంటలు వ్యాపించాయని వెల్లడించింది. భవనం స్వల్పంగా దెబ్బతిందని ఎవరికి గాయాలు కాలేదని వివరించింది. తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్‌లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఖతర్‌లోని ఇంధన కేంద్రంపైనా దాడి జరిగినట్లు తెలిసింది. బహ్రెయిన్, ఇరాక్‌లోని సైనిక స్థావరాలపైనా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. వరుసగా మూడో రోజు కూడా భీకర పోరు సాగుతుంది.
130కి పైగా నగరాలపై, నటంజ్ అణుస్థావరంపై ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయగా, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపైనా, కువైట్‌లోని అమెరికా ఎంబసీపైనా ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌పై చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని చైనా విజ్ఞప్తి చేయగా, మరో నాలుగైదు వారాలు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ప్రధాని నెతన్యాహు కార్యాలయంతో సహా పలు ఇజ్రాయిల్ లక్ష్యాలపై వరుసగా క్షిపణులతో దాడులు జరిపినట్లు రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. టెల్ అవీవ్, హైఫా, తూర్పు జెరూసలేం తదితర చోట్ల దాడులకు దిగామని, ఇది పదవ దాడి అని ప్రకటించారు. కువైట్ నగరంలోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఎంబసీ కాంపౌండ్ లోపల మంటలు, దట్టంగా పొగ కమ్ముకుందని కువైట్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
కువైట్‌లోని అమెరికాకు చెందిన అలీ అల్ సలేమ్ వైమానిక స్థావరాన్ని, హిందూ మహా సముద్రంలోని నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్‌లోని తమ ఎంబసీపై జరిగిన దాడి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య