కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలు ప్రకారం దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో రూ.1,83,609 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.1,69,779 కోట్లతో పోలిస్తే ఇది 8.1% అధికం. రీఫండ్లు పూర్తయిన తర్వాత నికర వసూళ్లు రూ.1,61,278 కోట్లకు చేరాయి. గత ఏడాదికంటే ఇది 7.9% అధికం. 2017లో జీఎస్టీ అమలైనప్పటి నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెల వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి.
ప్రధాన సరుకులు, వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్‌పై పన్ను రేట్లు తగ్గినా జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఉపసంహరణ జరిగినా నికర వసూళ్లలో ఏపీ ప్రభుత్వం వృద్ధినే నమోదు చేసింది. ఇదే నెలలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు రూ.4,125 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.3,619 కోట్లకంటే ఇది 14% అధికం. ఆంధ్రప్రదేశ్‌కు ఫిబ్రవరిలో రూ.3,061 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. ఇది గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.2,902 కోట్లకంటే 5% ఎక్కువ.
2025-26 ఆర్థిక సంవత్సరం గత 11 నెలల్లో ఎస్‌జీఎస్‌టీ సెటిల్‌మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రూ.31,178 కోట్లు, తెలంగాణకు రూ.42,182 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయంలో ఏపీ 3%, తెలంగాణ 5% వృద్ధి నమోదుచేశాయి. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు సగటున సాధించిన 6% వృద్ధికంటే తక్కువ.

More Stories
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాంప్రదాయ గిరిజన వంటకాలతో మిల్లెట్ మీల్ ‘అరకు కౌని’
గుంటూరుకు చెందిన పద్మకు “ఇండియా ఆర్ట్స్–2026” అవార్డు