జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం

జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం
* ఆగష్టు 25 నుండి ఏపీలో సంస్కృత సప్తాహం వారోత్సవాలు

సంస్కృతం పండితుల భాష గా ప్రజల్లో నానుడి ఉందని దాన్ని చెరిపివేసి సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత అకాడమీ ఏర్పాటు తర్వాత ఏ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించలేదని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తే తప్పా సంస్కృత భాషాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో వున్న సంస్కృత అకాడమీ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరుతూ  జూలై 3,4,5 తేదీల్లో ఢిల్లీ లోని కేంద్ర సంస్కృత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫీసర్ శ్రీనివాస్ వరకేది, భారతీయ భాష సమితి చైర్మన్ కృష్ణ స్వామి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద జోషిలను సంప్రదిస్తున్నట్టు తెలిపారు.