తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి రెండేళ్ల పదవీ కాలం ఇటీవల ముగిసింది. దీంతో టీటీడీ రోజువారీ నిర్వహణ, పరిపాలనా పనులు సాఫీగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 658 ద్వారా అధికారిక నియామకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే పూర్తి అధికారులు, బాధ్యతలను ఈ ప్రత్యేక అథారిటీకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ అథారిటీ చైర్మన్గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురి టీమ్ శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, బోర్డు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. కొత్త టీటీడీ ట్రస్ట్ బోర్డును పునర్వ్యవస్థీకరించే వరకు లేదా ఏడాది కాల పరిమితి పూర్తయ్యే వరకు ఈ స్పెసిఫైడ్ అథారిటీ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ 1న బీఆర్ నాయుడు ఛైర్మన్ గా, సభ్యులతో కమిటీ రెండేళ్ల కాల పరిమితితో నియామకం చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది.

More Stories
రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
ఒంగోలు సమీపంలో మురసు తుఫాన్ తీరం దాటే అవకాశం
ఏపీ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్