నవంబర్ 1 నుండి ఢిల్లీలో అమలులోకి రానున్న బీఎస్ -VI వాహనాలకు మూడు నెలలపాటు ప్రవేశం నిషేధించారు. దానితో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌ల నుండి ప్రతిరోజూ ఢిల్లీకి ప్రయాణించే వేలాది మందిపై ప్రభావం చూపవచ్చు. ఈ కొత్త ఆంక్షల ప్రకారం, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయ్యి, బీఎస్ -VI ఉద్గార ప్రమాణాలను పాటించని వాహనాలను 2027 జనవరి 31 వరకు రాజధానిలోకి ప్రవేశించడానికి అనుమతిం చారు.
గాలి నాణ్యత గణనీయంగా పడిపోయే శీతాకాలంలో కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ అంచనాల ప్రకారం, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సుమారు 10 లక్షలకు పైగా వాహనాలు బీఎస్ -VI ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేవు.
గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో కలిపి దాదాపు రెండు లక్షల వాహనాలు ఈ వర్గంలో ఉన్నాయి. వీటిలో సుమారు 70 శాతం వాహనాలు బీఎస్ -III, బీఎస్ -IV ప్రమాణాలకు చెందినవి. ఈ రెండు జిల్లాల్లో సుమారు 50,000 వాణిజ్య వాహనాలు కూడా నిర్ణీత ప్రమాణాలను అందుకోలేకపోయాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పొరుగు జిల్లాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
నోయిడా, గ్రేటర్ నోయిడాలలో బీఎస్ -VI ప్రమాణాలు లేని వాహనాలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయి, వీటిలో సగానికి పైగా బీఎస్ -IV ప్రమాణాలు కలిగినవి (ప్రధానంగా పెట్రోల్ కార్లు). ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఘజియాబాద్‌లో కూడా సుమారు నాలుగు లక్షల వాహనాలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేవు.
అయితే, ఈ గణాంకాల పరిధిలోకి వచ్చే వాహనాలన్నీ ఈ ఆంక్షల వల్ల ప్రభావితమవుతాయని అర్థం కాదు. ఈ నిషేధం కేవలం ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయ్యి, బీఎస్ –VI ప్రమాణాలు లేని వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిషేధం నుండి సిఎస్జి, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. అలాగే, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, అత్యవసర సేవలకు ఉపయోగించే కొన్ని వాహనాలకు కూడా ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుంది.
ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయినప్పటికీ, బీఎస్ -VI ఉద్గార ప్రమాణాలను పాటించే వాహనాలు రాజధానిలోకి ప్రవేశించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలకు ఈ ప్రత్యేక ఆంక్షలు వర్తించవు. అయితే, అవి ఇతర కాలుష్య నియంత్రణ నిబంధనలను, వాహనాల వయస్సుకు సంబంధించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. చెక్పాయింట్లు, కీలక ట్రాఫిక్ లేన్లలో ఏర్పాటు చేసిన ఏఐ-ఆధారిత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, అవసరమైన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను గుర్తించడంలో సహాయపడటానికి వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి.

More Stories
వీహెచ్‌పీ డిమాండ్‌తో వివాదాస్పద కవిత తొలగించిన గుజరాత్ ప్రభుత్వం
9-12 తరగతులకు ఏఐ పాఠాలు- డీప్‌ఫేక్‌ల గుర్తింపుపై ప్రత్యేక శిక్షణ
మహిళా వైద్యురాలిని నేలపై పడవేసి, దుస్తులు చింపేసిన దుండగుడు