2014కు ముందు మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పరిమితంగా ఉండగా.. ప్రస్తుతం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తూ దేశ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తనను పాలకుడిగా కాకుండా ప్రజల సేవకుడిగా భావిస్తారని అన్నారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న మోదీ మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే ప్రజాప్రతినిధికి నిజమైన సంతృప్తినిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు, రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే రాజకీయ నాయకత్వానికి అసలైన పరమార్థమని స్పష్టం చేశారు.
ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచనా విధానంలో ప్రజాసేవ అంతర్భాగం కావాలని, సమాజానికి మేలు చేసినప్పుడే అంతర్గతంగా నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు మృతి
‘ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితాలో ఆధిక్యంలో మహిళా ఓటర్లు!