శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి, ఇస్రోకు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05 5ను మోసుకెళ్తున్న జీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 2:55 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే, ఈవోఎస్-05 ఉపగ్రహం నిర్దేశిత ‘సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్’లో విజయవంతంగా ప్రవేశపెట్టారు.
“అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05 (జియో-ఇమేజింగ్ శాటిలైట్)ను జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహక నౌక విజయవంతంగా, కచ్చితంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన్నట్లు ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను,” అని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మాట్లాడుతూ, జీఎస్ఎల్వీ ద్వారా జిటిఓ లేదా సబ్-జిటిఓ కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇదే అత్యంత బరువైనదని పేర్కొన్నారు.
“ఇది మనందరికీ ఎంతో గర్వకారణమైన, సంతోషకరమైన క్షణం. జీఎస్ఎల్వీ- తన 19వ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. జీఎస్ఎల్వీ ఎఫ్17 ద్వారా జిటిఓ లేదా సబ్-జిటిఓ కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇదే అత్యంత బరువైనది. ప్రయోగం కేవలం కొన్ని నిమిషాలే జరుగుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ మిషన్ ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుండి దేశంపై నిరంతర నిఘా (బర్డ్స్-ఐ వ్యూ) ఉంచేలా దీనిని రూపొందించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహక నౌక 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువును కలిగి ఉండి, భారతదేశపు అతిపెద్ద కార్యాచరణ వాహక నౌకలలో ఒకటిగా నిలిచింది.
ఇస్రో యొక్క జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ మిషన్ విజయవంతం కావడంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయని, తద్వారా ప్రపంచ అంతరిక్ష శక్తిగా దేశ స్థానం మరింత బలపడుతోందని ఆయన తెలిపారు. “ఈవోఎస్-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం, జియోసింక్రోనస్ కక్ష్య నుండి భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది విజిబుల్, ఇన్‌ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్‌లలో అధునాతన ఇమేజింగ్‌ను సాధ్యం చేస్తుంది,” అని జితేంద్ర సింగ్ ఎక్స్ లో రాశారు.
భారత్‌లో జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేయనున్న ఈ ఉపగ్రహం భారత భూభాగాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ప్రతి అర్ధ గంటకు ఒకసారి భారత్, దాని సరిహద్దులు, పొరుగు దేశాల భూభాగాలను హైరిజల్యూషన్‌తో ఫోటోలు తీస్తుంది. ఏదైనా ప్రాంతాన్ని మరింత నిశితంగా పర్యవేక్షించాల్సి వస్తే.. 5 నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించిన హెచ్‌డీ ఫొటోలను గ్రౌండ్‌స్టేషన్‌కు పంపిస్తుంది. తుఫానులు, వరదలు, మేఘ విస్ఫోటనం వంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు అంచనా వేయనుంది.

More Stories
విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం
వైసీపీలో నంబర్ 1గా సజ్జల, నంబర్ 2గా జగన్!
విశాఖ ఏపీటిడబ్ల్యుఆర్ పాఠశాలపై బాలల కమిషన్ జోక్యం చేసుకోవాలి