ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థల ఆచూకీ కనుగొనేందుకు పాకిస్తాన్, భారతదేశంలో గూఢచారులను, స్లీపర్ సెల్స్‌ను మోహరించిందని ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ వైమానిక రక్షణలో ఎస్-400 ఒక కీలక భాగంగా అవతరించింది. పాకిస్తాన్ నుండి ఎదురయ్యే వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది.
సిందూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా ఉన్న మిశ్రా, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, రష్యాకు చెందిన ఈ వైమానిక రక్షణ వ్యవస్థల స్థానాలను గుర్తించే ప్రయత్నంలో పాకిస్తాన్ ‘అన్ని రకాల ఎత్తుగడలను’ ఉపయోగించిందని పేర్కొన్నారు. ఎస్-400ల కారణంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల పరిధిలోకి రాలేకపోయాయని ఆయన తెలిపారు.
ఈ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ వైమానిక ఆస్తులు పదేపదే అడ్డుకుంటుండటంతో పాకిస్తాన్ ఎస్-400ను తమ అతిపెద్ద ముప్పుగా పరిగణించింది. “ఎస్-400ను గుర్తించడానికి వారు ‘సాధ్యమైన ప్రతి ఎత్తుగడనూ’ ప్రయోగించారు,” అని ఎయిర్ మార్షల్ చెప్పారు. ఇస్లామాబాద్ మరో దేశం నుంచి ఉపగ్రహ సహాయం పొంది ఉండవచ్చని కూడా ఆయన వెల్లడించాయిరు. కానీ ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించారు.
భారతదేశం ‘సుదర్శన చక్ర’ అని పిలిచే ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ, దేశ వైమానిక రక్షణ వ్యవస్థలో ఒక కీలకమైన భాగం. అత్యాధునిక రాడార్లు, శత్రు లక్ష్యాలను అడ్డుకునే సామర్థ్యాలతో కూడిన ఈ వ్యవస్థ, సుదూర ప్రాంతాల నుండే గగనతల ముప్పులను గుర్తించి వాటిని ఎదుర్కోగలదు. ఐదు ఎస్-400 వ్యవస్థల కోసం భారతదేశం, రష్యా 2018లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత వైమానిక దళంలో చేరాయి.నాలుగవ స్క్వాడ్రన్ జూన్ 2026లో అందుబాటులోకి వచ్చింది.
సుమారు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన అత్యంత విలువైన నిఘా విమానాన్ని కూల్చివేయడంలో ఈ వ్యవస్థ సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం కీలక పాత్ర పోషించింది. సుమారు 400 కిలోమీటర్ల గరిష్ట పరిధిని కలిగిన ఎస్-400 ట్రయంఫ్, ఒకే సమయంలో అనేక గగనతల లక్ష్యాలను ట్రాక్ చేయడానికి, వాటిని ఎదుర్కోవడానికి వీలుగా రూపొందించారు.

More Stories
“రక్షే, మా చలా, మా చలా”.. రాష్ట్రపతి రక్షాబంధన్ శుభాకాంక్షలు
జబల్పూర్లోని టి-సిరీస్ ట్యాంకుల ప్రాజెక్ట్‌కు భూమి పూజ
29 నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లలో ప్రధాని మోదీ పర్యటన